100 శాతం పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
అబ్దుల్లాపూర్‌మెట్ ఎంపీడీవో శ్రీవాణి
అబ్దుల్లాపూర్‌మెట్: అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే 95శాతం పూర్తయిందని ఎంపీడీవో యూ శ్రీవాణి తెలిపారు. మండల పరిధి బ్రిలియంట్ కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీవో శ్రీవాణి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వే మండల పరిధిలో ఈనెల తొమ్మిదవ తేదీ నుంచి సమగ్ర కుటుంబ ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు.
అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో ఇట్టి సర్వే సుమారుగా 95 శాతం పూర్తి అయిందని వివరించారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని గ్రామపంచాయతీలలో, మీ ఆవాస ప్రాంతాల్లో ఎవరైనా సర్వే నిర్వహణకు సంబంధించిన అధికారులు మీ వద్దకు రాకున్నా, అదేవిధంగా మీరు అందుబాటులో లేకపోవడం, మీ ఇంటికి తాళం వేసి ఉన్న సందర్భంలో గానీ సర్వేలో నమోదు కానీ కుటుంబాల వారు దయచేసి 100% సర్వే నమోదు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా సర్వేలో ఇంకా మిగిలిన ఉన్న కుటుంబాలు సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి/ మండల పరిషత్ అభివృద్ధి అధికారి, చరవాణి ద్వారా 8317679293 లేదా ప్రత్యక్షంగా సంప్రదించి మీ కుటుంబాన్ని ఇట్టి సర్వేలో నమోదు చేయించుకోవాల్సిందిగా కోరారు.
అదే విధంగా సమగ్ర కుటుంబ సర్వే నేడు చివరి తేదీ అని ఎంపీడీవో తెలిపారు. మండల పరిధిలో ఎవ్వరైనా కుటుంబ సర్వే వివరాలను నమోదు చేయించుకోనివారు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి మీమీ వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, లష్కర్‌గూడ పంచాయతీ కార్యదర్శి బబిత, మజీద్‌పూర్ పంచాయతీ కార్యదదర్శి రాఘవేందర్ తదితరులు ఉన్నారు.