calender_icon.png 28 November, 2024 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే

06-11-2024 01:56:32 AM

  1. మొత్తం 75 ప్రశ్నలు
  2. 30లోగా సర్వే పూర్తి

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణనకు సంబంధించిన సమగ్ర కుటుంబ సర్వే బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధి కారులు ఇప్పటికే పూర్తి చేశారు.

ఇందు కోసం 90 వేల మంది ప్రభుత్వ సిబ్బంది ఎన్యుమరేటర్లుగా సర్వేలో పాల్గొననున్నారు. అన్ని వివరాలతో ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే సిబ్బందికి పలుమార్లు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. 

సర్వేలో ఉపాధ్యాయులే ఎక్కువ...

కుటుంబ సర్వే మూడు వారాల పాటు జరగనున్నది. ఇందులో మొత్తం 80 వేల మందికిపైగా సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రైమరీ స్కూ ల్ టీచర్లు, హెడ్‌మాస్టర్లు ఎక్కువగా ఉన్నా రు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వేలో మొత్తం 36,559 మంది ఎస్‌జీటీలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్లు పాల్గొననున్నారు.

దీంతోపాటు 6,256 మంది ఎంఆర్ సీ సిబ్బంది, 2000 మంది సర్కారు, జెడ్పీ స్కూళ్లలోని సిబ్బంది, ఎయిడెడ్ స్కూళ్లలోని మినిస్టీరియల్ సిబ్బందిని వినియోగించుకుంటామని అధికారులు ప్రకటించారు. వీరి తోపాటు తహశీల్దారు, ఎంపీడీవో, ఎంపీవో సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్ల సేవలను వినియోగించుకోనున్నారు.

సర్వే లో ఎన్యుమరేటర్లుగా ఎక్కుగా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులే పాల్గొననున్న నేపథ్యంలో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు స్కూళ్లు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వీరందరూ సర్వే విధుల్లో పాల్గొంటారు. 

వివరాల సేకరణ ఇలా...

కుటుంబ సర్వేలో ప్రధానంగా 56 ప్రశ్నలుండగా ఉప ప్రశ్నలతో కలుపుకుని మొత్తం 75 ప్రశ్నలుంటాయి. పార్ట్ కుటుంబ యజమాని, సభ్యుల విద్య, ఉద్యోగ, భూమి తదితర వ్యక్తిగత వివరాలుంటాయి. పార్ట్ కుటుంబానికి ఉన్న రుణాలు, స్థిరాస్తి, రేషన్‌కార్డు, విద్యుత్ తదితర వివరాలుంటాయి. కుటుంబంలోని అందరి ఆధార్ కార్డు, బ్యాంకుఖాతా, మొబైల్ నంబర్లు వంటి వ్యక్తిగత వివరాలన్నీ సేకరించనున్నది.

రాష్ట్రంలోని అన్ని కుటుంబాల డేటా ప్రభు త్వం దగ్గర రెడీగా ఉండటానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని అధికారులు చెబుతు న్నారు. ఇప్పుడు చేపడుతున్న సర్వేతో మొత్తం డేటా సేకరిస్తున్నందున భవిష్యత్‌లో అవసరాలకు రెడీమెడ్ సమాచారంగా ప్రభుత్వానికి దోహదపడుతుంది. ప్రభుత్వం పాఠ శాలల్లో చదువుకోవడం, మధ్యలోనే ఆపేయడం, సంక్షేమ పథకాల అమలు ద్వారా లబ్ది పొందడం వంటి అంశాలను సేకరించి నమోదు చేయనున్నారు. 

ఏర్పాట్లు పూర్తి...

సర్వేలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే యుద్ధప్రాతిపదికన కుటుం బ సర్వేకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేశారు. అవసరమైన సామాగ్రి కూడా కలెక్టరేట్లలో సిద్ధం చేశారు. సర్వే చేసే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లను గుర్తించగా, వారికి ఎన్యుమరేటర్ల బ్లాక్‌ను నిర్దేశించడంతోపాటు షెడ్యూల్, స్టిక్కర్లు, ఇళ్ల జాబితా అందజేశారు.

ప్రతి ఈబీకి ఒక ఎన్యుమరేటర్, 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ ఉండనున్నారు. ఎన్యుమరేషన్ పూర్తున తర్వాత తమకు కేటాయించిన డేటా కేంద్రానికి వచ్చి డేటా ఎంట్రీ చేయించాల, ఆ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని, సమాచారం బయటపెడితే కఠిన చర్య లు ఉంటాయని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. రోజువారీ సర్వే పురోగతిని సాయంత్రం ఆరుగంటలకు ప్రణాళిక శాఖకు పంపాల్సి ఉంటుంది. 

ప్రైమరీ స్కూళ్లలో ఒంటిపూట

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు బు ధవారం నుంచి ఒంటిపూటే నడవనున్నాయి. ప్రభుత్వం మూడు వారాల పాటు చేపట్టనున్న కులగణన సర్వేలో  ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్జీటీ టీచర్లు, హెచ్‌ఎంలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైమరీ పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పనిచేస్తాయి.

ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం వరకు టీచర్లు సర్వే విధుల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక్కపూట పాఠశాలలను నడిపి, తర్వాత పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టి టీచర్లు సర్వేలో పాల్గొనాల్సి ఉం టుంది. అయితే హైస్కూళ్లు యథావిధి గా నడుస్తాయి.

ఈ సర్వే కోసం ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, టీచర్లు మొత్తం కలిపి దాదాపు 80వేల మంది సిబ్బంది ని, ప్రభుత్వ ఉద్యోగుల సేవలను ప్రభు త్వం వినియోగించుకుంటోంది.

వీరిలో విద్యాశాఖ నుంచి 36,559 మంది ఎస్‌జీటీలు, 3,414  మంది పీఎస్ హెచ్‌ఎం లు, 6,256 మంది ఎంఆర్‌సీ  సిబ్బంది, మరో 2వేల మంది పాఠశాలల్లో పనిచేస్తున్న టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లున్నారు. మొత్తం 80 వేల మందిలో సగం మంది సర్కారు టీచర్లే ఉన్నారు.