calender_icon.png 22 November, 2024 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ పారదర్శకంగా నిర్వహించాలి

22-11-2024 03:15:46 PM

జిల్లాలో సర్వే 91.31 శాతం పూర్తి 

మెదక్ (విజయక్రాంతి): శుక్రవారం సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ నిర్వహణపై సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్స్, మండల అభివృద్ధి అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సామాజిక ఆర్థిక రాజకీయ విద్య కుటుంబ సర్వే అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, తుది దశకు చేరుకుందని డేటా ఎంట్రీ నిర్వహణలో సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ నిర్వహించడం జరిగిందని చెప్పారు. డేటా ఎంట్రీ నిర్వహించేటప్పుడు కోడింగ్ విధానం పరిశీలించుకోవాలని, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు 91.31% సర్వే పూర్తయిందని తెలిపారు. డేటా ఎంట్రీ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం ఉందని అన్నారు. మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఎంపీ ఓస్ పటిష్ట ప్రణాళికల ద్వారా డేటా ఎంట్రీ నిర్వహణకు సహకరించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ డేటా ఎంట్రీ నిర్వహణకు గాను 369 కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకొని త్వరితగతిన నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.