05-03-2025 12:00:00 AM
వనపర్తి టౌన్, మార్చి 4 : మహిళా సాధికారతతోనే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ న్యాయమూర్తి వి రజని అన్నారు మంగళవారం వనపర్తి లోని ఎస్వీఎంఆర్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది.
ఈ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాజ్యాంగం కల్పించిన హక్కులను చట్టాలను వినియోగించుకొని మహిళలు అన్ని రంగాలలో అత్యున్నతమైన స్థానంలో ఉండాలని కోరారు బాల్యవివాహాలు చేసి మహిళల అభివృద్ధికి భంగం కలిగించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు బాలికలకు మహిళలకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఉచిత న్యాయ సేవలు అందిస్తుంది అని తెలియజేశారు.
కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమైన చట్టాలను వివరించడంలో భాగంగా బాల్యవివాహాల చట్టం ఫోక్సో యాక్ట్ బాల కార్మికుల చట్టం మోటారు వెహికల్ చట్టం గురించి తెలియజేశారు ఉచిత న్యాయ సలహాలు కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు ఈ కార్యక్ర మంలో కళాశాల సిబ్బంది చాంద్ పాషా కల్పన గారు పాల్గొన్నారు