- ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ పరిశీలన
- కిష్టాపురం పంచాయితి కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సంతోష్
గద్వాల, జనవరి 18 (విజయక్రాంతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయి పరిశీలనలో సమగ్ర వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులకు ఆదేశించారు.
శనివారం ఐజా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అరులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను నిశితంగా పరిశీలన జరిపారు. అరులైన లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన గుర్తిస్తున్నారు, ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటు న్నారు.
సేకరించిన అంశాలను రిజిస్టర్లలో క్రమపద్ధతిలో నమోదు చేస్తున్నారా? లేదా అని తనిఖీ చేసిన కలెక్టర్, అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రతీ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఫీల్డ్ వెరిఫికేషన్ వేగంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశిం చిన మార్గదర్శకాలను అనుసరిస్తూ సమగ్ర వివరాలను సేకరించాలని, ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తులు, సామాజిక ఆర్ధిక సర్వే వివరాలతో క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను సరిచూసుకోవాలని అన్నారు.
రైతు భరోసా పథకానికి సంబంధించి నలా కన్వర్షన్, భూసేకరణ,లే అవుట్, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములను సర్వే నెంబర్ల వారీగా పరిశీలించాలని, భూభారతి (ధరణి) పోర్టల్, గూగుల్ మ్యాప్ ల ఆధారంగా వాస్తవ వివరాలను నిర్ధారణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
డిజిటల్ సంతకం ఉన్న పట్టా పాస్ బుక్కులకు సంబంధించి కూడా సదరు భూములలో పంటలు సాగు చేస్తున్నారా లేదా అన్నది క్రాప్ బుకింగ్ వివరాల ఆధారంగా పరిశీలన చేయా లన్నారు. వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములను క్షేత్రస్థాయిలో గుర్తించి పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని, వాటిని సంబంధిత పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని సూచించారు.
సేకరించిన వివరాలను వెంటదివెంట తప్పులు లేకుండా క్రమపద్ధతిలో రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలని, తద్వారా డేటా ఎంట్రీ సమయంలో పొరపాట్లకు అవకాశం ఉండదని అన్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించిన వ్యవసాయ యో గ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఐజా మండలంలోని సర్వే నంబర్లు 913, 930, 518, వడ్డేపల్లి శివారులోని సాగు చేయని భూములను స్వయంగా పరిశీలించారు.
కిష్టాపురం గ్రామంలోని పంచాయితి కార్యాలయాన్ని ఆకస్మిక తనికీ చేసి, కొత్త రేషన్ కార్డుల కోసం అరులైన కుటుంబాలను గుర్తించే సమయంలో, పాత కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు లేకుండా క్షుణ్ణంగా పరిశీలన జరపాలని అన్నారు. రేషన్ కార్డులలో పేర్ల తొలగింపుతో పాటు కొత్త పేర్లను చేర్చడం వంటివి కూడా చేయాల్సి ఉన్నందున దరఖాస్తు దారుని కుటుంబంలోని సభ్యులందరి వివరాలను సేకరిం చాలని కలెక్టర్ తెలిపారు.
ఎలాంటి గందరగోళం, తప్పిదాలకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అరుల జాబితాల రూపకల్పనలో ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు జ్యోతి, ప్రభాకర్, ఎంపీడీఓ వెంకటయ్య, జిల్లా పంచాయతీ అధికారి శ్యాంసుందర్, పౌరసరఫరాల శాఖ అధికారి స్వామి కుమార్, ఆర్.ఐలు, ఏఈఓలు, పంచాయతీ సెక్రెటరీలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.