calender_icon.png 19 February, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఉపసంహరణ ప్రక్రియ

14-02-2025 12:00:00 AM

  • 13 మంది అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ
  • పట్టభద్రుల ఎమ్మెల్సీకి 56, టీచర్స్ ఎమ్మెల్సీకి 15 మంది  అభ్యర్ధులు పోటీ

కరీంనగర్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మెదక్ నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురు వారం ముగిసింది. 13 మంది అభ్యర్థులు తమ నామినేషషన్లను ఉపసంహరించుకున్నారు.

12 మంది పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్య ర్థి తమ నామినేషన్లను ఉపసంహరించుకు న్నారు. డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మదనం గంగాధర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి మద్దతు పలుకు తూ తన నామినేషన్‌ను ఉపసంహరించు కున్నారు.

నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లను గవ్వల లక్ష్మీ, ఎడ్ల సాయి కృష్ణప్రియ, కావూ రి సత్యనారాయణగౌడ్, ఆలగొండ కృష్ణ హరి, నాలకంటి యాదగిరి, బడే నరసయ్య, లింగాల శ్రీనివాస్, రేకల సైదులు, మదనం గంగాధర్, లింగం కృష్ణ, సోమగాని నరేంద ర్, దార మనోహర్ లు ఉపసంహరించు కున్నారు. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గవ్వల శ్రీకాంత్ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీకి 56, టీచర్స్ ఎమ్మెల్సీ 15 మంది పోటీ

మెదక్-, నిజామాబాద్, -కరీంనగర్-, ఆది లాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు 68 మందిలో 12 మంది నామినేషన్లు ఉప సంహరించుకోగా బరిలో 56 మంది నిలిచా రు. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు 16 మందిలో ఒకరు నామినేషన్ ఉపసంహరిం చుకోగా 15 మంది పోటీ పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా చెన్నమైల్ అంజిరెడ్డి, బీఎ స్పీ తరపున ప్రసన్న హరికృష్ణ,

ఆలిండియా కిసాన్ జనత పార్టీ అభ్యర్థిగా ఎల్ చంద్ర శేఖర్, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ తరపున దొడ్ల వెంకటేశం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్ధిగా జడ్సన్ బక్క, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మంద జ్యోతి, తెలంగాణ ద్రావిడ ప్రజల పార్టీ అభ్యర్ధిగా బొల్లి సుభాష్, నేషనల్ నవ క్రాంతి పార్టీ అభ్యర్థిగా సిలివేరి ఇంద్ర గౌడ్ లు బరిలో నిలిచారు.

అలాగే స్వతంత్ర అభ్య ర్థులుగా సిలివేరు శ్రీకాంత్, దూడ మహి పాల్, చంద్రశేఖర్ చాలిక, కంటె సాయన్న, మంచికట్ల సాయన్న, వేముల కరుణాకర్ రెడ్డి, పడిశెట్టి రాజు, గవ్వల శ్రీకాంత్, యాద గిరి శేఖర్ రావు, అక్షయ్ కుమార్ మేకల, అశోక్ గౌడ్ అబ్బగోని, దేవతి శ్రీనివాస్, జి సాయికృష్ణ మూర్తి, మహేష్ కొమిరెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, వేముల విక్రమ్ రెడ్డి, దయ్యా ల ఓంప్రసాద్, బండారి రాజ్ కుమార్, డాక్టర్ రాపాల రాజు, సంకినేని మధుసూ దన్ రావు, బి బాలాజీ,

మెతుకు హేమలత, చంద సాయికుమార్, రమేష్ బాబు సింగార పు, ఎన్ శ్రీనివాస్, జావీద్ అహ్మద్, మహ్మ ద్ ముస్తాక్ ఆలీ, అంగ సంపత్ యాదవ్, దేవునూరి రవీందర్, అవినాష్ యదవ్, మల్లేష్ యాసర్ల, పులగం దేవిదాస్, డాక్టర్ నిమ్మతోట వెంకటేశ్వర్లు, మచ్చ శ్రీనివాస్, టి సుధాకర్ రావు, సుంకిసాని రాజ సుమన్ రావు, అక్కెనపల్లి కరుణాకర్, మార్పడగ చెన్న కృష్ణ రెడ్డి, లైశెట్టి హరికృష్ణ, నగేష్ కొమ్ముల, కస్బ శంకర్ రావు, చిట్కుల నరేందర్ రెడ్డి, రాథోడ్ రవీందర్ నాయక్, బండి శ్రీనివాస్, కర్ర జగన్నాథ్, గుమ్మడి శ్రీశైలం ముదిరాజ్ లు పోటీలో ఉన్నారు.

అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మల్క కొమురయ్య, యాటకరి సాయన్న, గవ్వల లక్ష్మీ, వై అశోక్ కుమార్, కంటె సాయన్న, కూర రఘోత్తంరెడ్డి, చలిక చంద్రశేఖర్, జగ్గు మల్లారెడ్డి, ఇన్నరెడ్డి తిరుమల రెడ్డి, మామిడి సుధాకర్ రెడ్డి, ముత్తారం నరసింహ స్వామి, వంగ మహేందర్ రెడ్డి, వేముల విక్రమ్ రెడ్డి, సిలివేరు శ్రీకాంత్, ఎల సుహాసినీలు అభ్య ర్థులుగా నిలిచారు.