calender_icon.png 1 February, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధులు కేటాయిస్తే రెండేళ్లలో పూర్తి

01-02-2025 01:29:39 AM

* కొత్తపల్లి- రైల్వే లైన్‌పై చిగురిస్తున్న ఆశలు

* నిర్మలమ్మ పద్దు పైనే గంపెడాశ

కరీంనగర్, జనవరి31 (విజయక్రాంతి): తెలంగాణ కలల ప్రాజెక్టు కొత్తపల్లి-మనోహ రాబాద్ రైల్వే లైన్ నిర్మాణ పనులు 2027 నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో కేంద్రం ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించే బడ్జెట్లో ఈ లైన్కు భారీ కేటాయింపులు ఉంటాయని ప్రజలు ఆశిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు వల్ల కనెక్టి విటీ మరింత పెరగడమే కాకుండా ఇతర స్టేషన్లలో అంతరాయం ఏర్పడినప్పుడు ఢిల్లీ కి మార్గం ఈ లైన్ ద్వారా సుగమం కానుం ది. 2016లో 155.36 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రారంభంలో ఈ ప్రాజెక్టు అంచ నా వ్యయం 1160.48 కోట్లు కాగా జాప్యం కారణంగా అంచనాలు పెరిగి సవరించిన వ్యయం 2780.78 కోట్లకు చేరింది. ఇప్పటికే 1444 కోట్లు ఖర్చు చేశారు.

ఇప్పటి వరకు 76.135 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తయింది. ఇంకా 75 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి చేయవలసి ఉంది. 2024-25 ఆర్థిక సంవ త్సరంలో ఈ ప్రాజెక్టుకు 350 కోట్ల రూపా యలు కేటాయించారు. ఈ బడ్జెట్లో కేటా యింపు కనీసం 500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాదికి సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో 30 కిలోమీటర్లకుపైగా నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా ఎంచుకు న్నారు. ఇప్పటికే అవసరమైన 90 శాంతం భూసేకరణ పూర్తయింది. సిరిసిల్ల జిల్లాలో 37.5 ఎకరాల అటవీ భూమిని మళ్లించాల్సి ఉంది. దీని కోసం కేంద్ర ెంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రయత్నా లు చేస్తున్నారు.

సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు 10.7 కిలోమీటర్లు 2026 వరకు, 2027 డిసెంబర్ నాటికి వేములవాడ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు 30.06 కిలోమీటర్లు పూర్తి చేయాలని లక్ష్యం గా ఎంచుకున్నారు. దేవాలయాలను కలుపు తూ కొత్తపల్లి-మనోహరాబాద్కు ఒక ప్రత్యేక త ఉంది.

ఇది తెలంగాణలోని ప్రసిద్ధ దేవాల యాలను కలిపే లైన్ కావడంతో దీని కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొత్తపల్లి మ నోహరాబాద్ రైల్వే లైన్ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడను కలుపుతూ కొత్తపల్లి వరకు సాగుతుంది. కొత్తపల్లి నుండి నిజా మాబాద్ రైల్వే లైన్ ద్వారా కొండగట్టును తాకుతూ మార్గం ఉంటుంది. ఈ రెండు పుణ్యక్షేత్రాలతోపాటు జగిత్యాల సమీపం లోని ధర్మపురికి వెళ్లే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. 

స్టేషన్లు ఇవే... 

కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ప్రధాన స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇదే జిల్లా వెదిర, సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి, వేముల వాడ, సిరిసిల్ల, చిన్నలింగాపూర్ స్టేషన్లు ఉంటాయి. తర్వాత సిద్ధిపేట జిల్లా గుర్రాల గొండి, సిద్ధిపేట, దుద్దెడ, లకాదరం ఉంటా యి. తర్వాత గజ్వేల్ జిల్లా గజ్వేల్ ఉంటుంది. తర్వాత ఈరానగర్, అప్పాయిపల్లి, హైదరా బాద్ సమీపంలోని నాచారం మీదుగా మనోహరాబాద్ వరకు ఉంటుంది. ఇప్పటికే సిద్ధిపేట స్టేషన్ అక్టోబర్ 3, 2023లో ప్రారంభమయింది. ప్రస్తుతం గూడ్స్ రవా ణా జరుగుతుంది.