- రెండో రోజు 5౦% హాజరు
- హైడ్రా, రుణమాఫీపై ప్రశ్నలు
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు పేపర్లకు కలిపి 50 శాతం మందే హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన పేపర్-1కు 51.1శాతం, పేపర్-2కు 50.7 శాతం హాజరుకాగా, సోమవారం నిర్వహించిన పేపర్-3కి 50.24 శాతం మంది హాజరైనట్లు టీజీపీఎస్సీ తెలిపింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 71.30 శాతం హాజరుకాగా, అత్యల్పంగా వరంగల్ జిల్లాలో 49.93 శాతం హాజరైనట్లు అధికారులు తెలిపారు. కాగా 1,363 పోస్టులను గ్రూప్-3 ద్వారా భర్తీ చేయనున్నారు.
పేపర్-౩కి అధిక సమయం..
పేపర్-3లో ప్రశ్నలు కఠినంగా వచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. భార త సర్వే, బడ్జెట్, తెలంగాణ సర్వే, బడ్జెట్ నుంచి.. 2011 జనాభా లెక్కలు, 5వ కుంటుంబ సర్వే నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. అలాగే హైడ్రా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రశ్నలు రాగా.. స్టేట్‌మెంట్‌తో కూడి న ప్రశ్నల వల్ల ఎక్కువ సమయం పట్టినట్టు అభ్యర్థులు తెలిపారు.