calender_icon.png 26 October, 2024 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన డీఎస్సీ పరీక్షలు

06-08-2024 02:40:59 AM

  1. 87.61 శాతం అభ్యర్థుల హాజరు
  2. ఈ నెల చివరి వారంలో ఫలితాలు

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): డీఎస్సీ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. 11,062 టీచర్ పోస్టులకు జూలై 18 నుంచి ఈనెల 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షలకు 2,45,263 (87.61 శాతం) మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు.

స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు 1,37,872 (85.24 శాతం) మంది, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షలకు 81,053 (92.10 శాతం) మంది, లాంగ్వేజ్‌పండిట్స్ పరీక్షలకు 16,092 (88.36 శాతం) మంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల పరీక్షలకు 10,246 (85.41 శాతం) మంది హాజరైనట్టు అధికారులు వివరించారు. వీటి ఫలితాలను ఈనెలాఖరున విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రాథమిక కీని రెండు మూడు రోజుల్లో విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి తుది కీని ఖరారు చేస్తారు. ఆ తర్వాత జనరల్ ర్యాంక్ లిస్టును విడుదల చేస్తారు. అనంతరం ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచి నియామక పత్రాలను అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.