calender_icon.png 21 April, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాతాలకుంట టన్నెల్ వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు

14-03-2025 12:00:00 AM

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల

మంత్రి తుమ్మల మార్చి చివరి వరకు రైతు భరోసా నిధులు 

రైతుల ఖాతాలో జమ చేస్తాo 

యాతాలకుంట టన్నెల్ పనుల పురోగతి పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, మార్చి -13 ( విజయక్రాంతి ):-యాతాలకుంట టన్నెల్ పనులు వేగంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గురువారం మంత్రి,  సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సత్తుపల్లిలోని యాతాలకుంట టన్నెల్ పనులను, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ లతో కలిసి ట్రాక్టర్ స్వయంగా నడుపుకుంటూ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లి నియోజకవర్గానికి మంచి పేరు ఉందని అన్నారు.

మన ఖమ్మం జిల్లా తలాపున పారుతున్న గోదావరి నదిని వినియోగించుకోవడం వల్ల మన ప్రాంతానికి కరువు శాశ్వతంగా దూరమవుతుందని అన్నారు. గతంలో దుమ్ముగూడెం మొదలు పెట్టినా, వైయస్సార్ హయాంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రతిపాదన తెచ్చిన, శ్రీరాముని దయతో నేడు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుపుకుంటున్న గోదావరి నీటి కోసమేనని,  ఈ ప్రాజెక్టులో పాలుపంచుకునే అవకాశం లభించిందని అన్నారు. గిరిజన ప్రాంతాలకు పూర్తిస్థాయిలో రోడ్డు సౌకర్యం కల్పించామని అన్నారు. రైతులు లాభసాటి పంట పండించుకునే దిశగా అవసరమైన సాగు నీరు అందించే చర్యలు తీసుకుంటామని అన్నారు. 

ప్రజలు తమ సమస్యల్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకుని రావాలని, పేపర్ లోలో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు స్పందించాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు. జిల్లాలో జాతీయ రహదారి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని, విజయవాడ జగదల్పూర్ రహదారి పూర్తి చేశామని, కొత్తగూడెం నుంచి హైదరాబాద్ రహదారి పనులు జరుగుతున్నాయని, సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు పనులు పూర్తి చేశామని, ఖమ్మం నుంచి దేవరపల్లి రాజమండ్రి పనులు ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని అన్నారు.

ప్రస్తుతం తన ప్రథమ కర్తవ్యం సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడమేనని మంత్రి అన్నారు. కొత్తగూడెంలోని జూలురుపాడు టన్నెల్, భూ సేకరణ పూర్తి చేసుకుంటే పాలేరుకు నీళ్ళు చేరుతాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి యాతాలకుంట టన్నెల్ పూర్తయితే లంక సాగర్ కు నీళ్లు వెళ్తాయని, సత్తుపల్లి మండలం, వేంసూరు మండలం , అశ్వరావు పేట వైపు మొత్తం మూడు లక్షల ఎకరాల వరకు ఆయకట్టు లభిస్తుందని అన్నారు.యాతాలకుంట పనులు వేగవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. 

సంవత్సరం కాలంలో యాతాలకుంట టన్నెల్, సత్తుపల్లి ట్రంక్ పూర్తి చేసి అదనపు ఆయకట్టు సాగు అవుతుందని అన్నారు. గోదావరి జలాలు వస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు.కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఇర్రిగేషన్ సిఇ శ్రీనివాస రెడ్డి, జెడ్పి సిఇఓ దిక్షా రైనా, ట్రాన్స్కో ఎస్‌ఇ శ్రీనివాస చారి, ఎస్డీసి రాజేశ్వరి, కల్లూరు ఆర్డీవో రాజేందర్,  ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.