calender_icon.png 7 November, 2024 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యక్ష బోధనతోనే సంపూర్ణ అవగాహన

07-11-2024 12:39:09 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): బోధనా రంగంలో ఎంతో సాంకేతికత వచ్చినప్పటికీ తరగతి గదిలో టీచర్ ప్రత్యక్ష బోధనతోనే విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కలుగుతుందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎం కుమార్ అన్నారు.

ఓయూ తెలుగు విభాగం ప్రొఫెసర్లుగా పనిచేసి పొట్టి శ్రీరాములు తెలు గు యూనివర్సిటీ, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వీసీలుగా నియమితులైన ప్రొ.వెలుదండ నిత్యానందరావు, ప్రొ.సూర్యధనంజయ్‌కు ఓయూ తెలుగు శాఖ ఆధ్వర్యం లో ఆర్ట్స్ కాలేజీలో బుధవారం అభినందన సభ నిర్వహించారు.

ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ అధ్యక్షతన జరిగిన సభలో వీసీ కుమార్ పాల్గొని మాట్లాడారు. సభలో ప్రొఫెసర్ కాశీం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సైదాతలత్ సుల్తానాతదితరులు పాల్గొన్నారు.