calender_icon.png 9 January, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత

06-01-2025 06:33:50 PM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి... 

పటాన్ చెరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత వహిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) తెలిపారు. నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారని అన్నారు. సోమవారం పటాన్ చెరు బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇంటి నమూనా పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత స్థలం కలిగి ఉన్న నిరుపేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయల సహాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటింటి సర్వే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మూడు విడతల్లో లబ్ధిదారుడికి నిధులు మంజూరు అవుతాయని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో  హౌసింగ్ పీడీ చలపతిరావు, ఎంపీడీవో యాదగిరి, డీఈ రవీందర్, ఏఈ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, విజిలెన్స్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.