calender_icon.png 4 March, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కాలేజీల పనులు పూర్తి చేయండి

04-03-2025 01:02:54 AM

సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ టీచింగ్ హాస్పిటళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. నిర్మాణ పనుల పురోగతిపై సోమవారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిం చారు.

పనులను వీలైనంత వేగంగా పూర్తి చేసి, రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు సహకరించాలని కోరారు. వైద్య విద్యార్థులు, రోగులకు ఇబ్బంది కలిగించకుండా పనులు చేపట్టాలన్నారు.

ఆయా ప్రాం తాల్లో జరుగుతున్న పనులను విభజించుకొని వేగవంతంగా పూర్తి చేసేందు కు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.