20-03-2025 01:39:46 AM
అధికారం ఆదేశించిన ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, మార్చి19(విజయ క్రాంతి): ఆదివాసి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పెయింటింగ్ చిత్రాలతోపాటు గిరిజన వంటకాలకు సంబంధించిన స్టాల్స్ నిర్మాణం, బాక్స్ క్రికెట్ గ్రౌండ్ పనులు శనివారం వరకు పూర్తి చేసి మ్యూజియమును విద్యుత్ కాంతులతో సర్వ సుందరంగా అలంకరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అధికారులు ఆదేశించారు.
బుధవారం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను ఆయన సందర్శించి, బోటింగ్ ప్రదేశాలు బాక్స్ క్రికెట్ గ్రౌండ్, మ్యూజియం లోపల చిత్రీకరణ జరుగుతున్న పెయింటింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి దగ్గర పడుతున్నందున శ్రీసీతారాముని కళ్యాణ వేడుకలు తిలకించడానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ట్రైబల్ మ్యూజియంను సందర్శించే విధంగా సన్నాహాలు చేస్తున్నందున, ఏ ఒక్క పని మిగలకుండా పూర్తిస్థాయిలో అన్ని పనులు పూర్తి కావాలన్నారు.
ప్రస్తుతం చిన్నారుల బోటింగ్ సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని, బాక్స్ క్రికెట్ గ్రౌండ్ మరియు గిరిజనుల ఆచార వ్యవహారాలు వారి కట్టుబాట్లకు సంబంధించిన పెయింటింగ్ చిత్రాల పనులు శుక్రవారం లోగా పూర్తి కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఉద్యా నవన అధికారి ఉదయ్ కుమార్, ఎ సి ఎం ఓ రమణయ్య, డి ఈ హరీష్, డీఎస్‌ఓ ప్రభాకర్ రా వు, ఏ ఈ రవి, ఈవో జిపి శ్రీనివాస్, మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు