calender_icon.png 11 January, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వాయర్ల పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి

11-12-2024 11:24:07 PM

జలమండలి అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

త్వరలో బొల్లారం, అమీన్ పూర్, తెల్లాపూర్, బీరంగూడ పరిధిలో నూతన రిజర్వాయర్లు, ట్యాంకుల ప్రారంభం

పటాన్ చెరు (విజయక్రాంతి): జలమండలి ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల ఫెజ్-2 పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జలమండలి అధికారులకు సూచించారు. త్వరలోనే ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్నారు. బుధవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని  క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని ఎమ్మెల్యేకు జలమండలి అధికారులు వివరించారు. ప్రధానంగా బొల్లారం, బీరంగూడ, అమీన్ పూర్, తెల్లాపూర్ పరిధిలో రిజర్వాయర్ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.

కాగా రాబోయే వారం, పదిహేను రోజుల్లో పంపింగ్ పనులు సైతం పూర్తి చేసి నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికల సిద్ధం చేసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. కాలుష్య జలాలతో ఇబ్బంది పడుతున్న బొల్లారం మున్సిపల్ పరిధిలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. పైపులైన్ల లీకేజీ విషయంలో చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జలమండలి జీఎం సుబ్బారాయుడు, డీజీఎంలు చంద్రశేఖర్, శివకుమార్, ఏఈలు ప్రవీణ్, పూర్ణేశ్వరి, శ్రీనివాస్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.