calender_icon.png 14 February, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరగా ‘మార్కెట్’ పూర్తిచేయండి

14-02-2025 12:00:00 AM

మద్దులపల్లి మార్కెట్‌ను సందర్శించిన మంత్రి పొంగులేటి 

ఖమ్మం, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ నిర్మాణ పనులను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా  స్థానిక నాయకులను మార్కెట్ నిర్మాణ పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి చేసి, వినియోగంలోకి వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో స్థానిక మండల నాయకు లు పాల్గొన్నారు.

పరామర్శలు.. శుభాశీస్సులు.. 

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి కూసుమంచి మండలంలో గురు వారం పర్యటించారు. మల్లేపల్లి, చేగొమ్మ గ్రామాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు కుటుంబాలను పరామ ర్శించిన తర్వాత నూతన జంటలను ఆశీర్వదించారు.

కరాటే వేణుకు అభినందన..

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజేతగా నిలిచిన ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ కరాటే మాస్టర్ వేణును తెలంగాణ రెవె న్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినం దించారు. మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో గురువారం కరాటే వేణుని శాలువతో ఘనంగా సత్కరించి అభినందించారు.

నేలకొండపల్లి పొంగులేటి పర్యటన..

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేల కొండపల్లి మండలంలో గురువారం పర్య టించారు. పాలడుగు పూర్ణచందర్‌రావు ఇటీవల చనిపోగా వారి కుటుంబాన్ని పరా మర్శించారు. భైరవునిపల్లిలో గొల్ల శ్రీను భార్య చనిపోగా ఆ కుటుంబాన్ని పరా మర్శించారు. చెన్నారంలో చింతనిప్పు సైదులు కుమారుని వివాహం ఇటీవల కాగా.. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నూతన వధూవరులను ఆశీర్వదించారు.