అధికారులను ఆదేశించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యాటకుల కోసం బస చేసే తాత్కాలిక విడిది హట్స్ (నివాస గృహాలు) అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు ఆదర్శించారు. బుధవారం నాడు గోదావరి కరకట్ట ఖాళీ ప్రదేశాలలో నిర్మాణం చేపడుతున్న పర్యాటకుల విడిది గృహాలను ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తో కలిసి ఆయన పరిశీలించారు. గృహాలలో పర్యాటకులు బస చేయడానికి కల్పించవలసిన పరుపులు, వారికి విడిదిలో కల్పించవలసిన భోజన సౌకర్యాలు గురించి అధికారులకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రివర్ ఫెస్టివల్ 9వ తారీఖు నాడు ప్రారంభిస్తున్నందున దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఆరో తారీకులోగా పూర్తి చేసి రెండు రోజులు లాంఛనంగా ట్రైలింగ్ నిర్వహించాలని, తొమ్మిదో తారీఖు నాడు పూర్తిస్థాయిలో సంబంధిత అధికారులు ఎవరికి అప్పగించిన పనులు సమన్వయంతో వచ్చే భక్తులకు తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని ప్రారంభించాలని అన్నారు. విడిది చేసే గృహాలలో ట్రైబల్ వంటకాలు మాత్రమే సరఫరా చేయాలని, వ్యర్ధాలు ఎక్కడపడితే అక్కడ పడు చేయకుండా డస్ట్ బిన్స్ ఏర్పాట్లు చేయాలని అలాగే కరకట్ట దగ్గర ఏర్పాటు చేసే స్టాల్స్ లో ముఖ్యంగా ట్రైబల్ కు సంబంధించిన వాటికి ప్రాముఖ్యత ఇవ్వాలని, ఆ స్టాల్స్ లో తేనె, కరక్కాయ పొడి, గిరిజనుల పాతకాలపు నగలు, వేదురు వస్తువులు, కుమ్మరి కమ్మరి వస్తువులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాట్లు చేసి పర్యాటకులకు అమ్మకాలు జరిపే వస్తువులు ప్రత్యేకంగా డిజైన్ గా ప్యాక్ చేసి సరసమైన ధరలకు అందించే విధంగా చూడాలని, పర్యాటకులు మరలా మరలా సందర్శించే విధంగా ఆకర్షణగా ఉండేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.
గిరిజన వంటకాలలో రెండు మూడు రోజులు శాఖాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అందరూ సమన్వయంతో అప్పగించిన పనులు పూర్తిచేసి భద్రాచలంకు మంచి పేరు వచ్చేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, ఇరిగేషన్ డి ఈ వెంకటేశ్వర్లు, ఏ ఈ వెంకటేశ్వర్, ఏసిఎంఓ రమణయ్య, మిషన్ భగీరథ రాజారావు, ఏపీఎంలు జగదీష్, కిషోర్, జేడీఎం హరికృష్ణ, జిపిఈఓ శ్రీనివాసరావు, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.