calender_icon.png 20 April, 2025 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సంపూర్ణ శ్రీమద్భగవద్గీత’ ప్రపంచ భాషల్లో రూపొందిస్తా

11-04-2025 12:54:23 AM

‘శ్రీమద్భగవద్గీత’ లోకార్పణ సభలో డా.గజల్ శ్రీనివాస్

పాలకొల్లు, ఏప్రిల్ 10: ప్రపంచ భాషల్లో ‘సంపూర్ణ శ్రీమద్భగవద్గీత’ ఆడియోను రూపొందించడమే తన లక్ష్యమని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే 25 భాషల్లో రికార్డింగ్ పూర్తయ్యిందని, ‘శ్రీమద్భగవద్గీత’ యూట్యూబ్ ఛానెల్, ఇతర మాధ్యమాల ద్వారా వినవచ్చునని పేర్కొన్నారు.

గజల్ శ్రీనివాస్ స్వస్థలమైన పాలకొల్లులోని లయన్స్ కమ్యూనిటీ హాల్‌లో  గురువారం లోకార్పణ సభలో  ఆయన తండ్రి కేశిరాజు నరసింహరావు చేతుల మీదుగా ‘సంపూర్ణ శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాను స్వరపరిచి, గానం చేసిన ‘సంపూర్ణ శ్రీమద్భగవద్గీత’ను  పల్లెపల్లెకు, గుండెగుండెకు చేర్చాలన్నదే తన ఆశయమని చెప్పారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డా.సీహెచ్ సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ, కళారత్న రసరాజు, రోటరీ అంతర్జాతీయ డైరెక్టర్ డా.వడ్లమాని రవి, సేవ్ టెంపుల్స్ భారత్ సభ్యులు మేడికొండ శ్రీనివాస్, అడ్డాల వాసుదేవరావు, ముచ్చర్ల సత్యనారాయణ, విఠకుల రమణ, రెడ్డప్ప ధవీజీ, మాంటిస్సోరి వర్మ, తటవర్తి కృష్ణమూర్తి, స్థానిక పెద్దలు, ప్రజలు భారీగా హాజరై గజల్ శ్రీనివాస్ గీతాగాన యజ్ఞాన్ని అభినందించారు.