calender_icon.png 30 April, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంపేట్ లో ఎస్ఎన్డీపీ పనులు పూర్తి చేయండి

29-04-2025 10:23:17 PM

మున్సిపల్ కమిషనర్ కు మాల్యాల రమణి ఫిర్యాదు..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): నిజాంపేట్ కార్పొరేషన్ లో మొదలు పెట్టి అసంపూర్తిగా వదిలేసిన ఎస్ఎన్డీపీ నాలా నిర్మాణ పనులు పూర్తి చేయండని ఆశా జ్యోతి ఉమెన్స్ నెట్ వర్క్ సంస్థ అధ్యక్షురాలు మాల్యాల రమణి నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ ను కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం కమిషనర్ సాబీర్ అలీని కలిసి వినతిపత్రం అందించారు. కార్పొరేషన్ పరిధిలో 9 చోట్ల ఎస్ ఎన్ డీపీ నాలా నిర్మాణ పనులను రూ. 84 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేయగా, 7 ఎస్ఎన్డీపీ నిర్మాణ పనులను ప్రారంభించి అసంపూర్తిగా పూర్తి చేశారని అన్నారు. మిగతా రెండు చోట్ల అసలు నాలా నిర్మాణాల పనులు మొదలు పెట్టలేదని అన్నారు.

వరద నీటిని మాత్రమే కాలనీలు ముంపుకు గురి కాకుండా తరలించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎస్ఎన్డీపీ నాలాలో మురుగు నీటి కాలువలు కలపడం నిషేధం అని ప్రభుత్వం తెలిపిందని అన్నారు. కానీ బాచుపల్లి బైరోని చెరువు నుండి కాసాని కౌసల్య కాలనీ మీదుగా వెళ్తున్న ఎస్ఎన్డీపీ నాలాను పూర్తి చేయక పోగా డ్రైనేజీ నాలాలు కలిపారని తన ఫిర్యాదులో తెలిపారు. తమ కాలనీ మీదుగా వెళ్తున్న ఎస్ ఎన్ డీ పీ నాలా పూర్తి కాకుండానే సుమారు 30 కోట్లు రూ. నిజాంపేట్ కార్పొరేషన్ నుండి చెల్లించడం దారుణం అని వాపోయారు. అసంపూర్తి నాలా పనులపై విచారణ చేపట్టి అసంపూర్తి పనులని పూర్తి చేసి, కలిపిన డ్రైనేజీ నాలాలని ఎస్ ఎన్ డీపీ లో కలవకుండా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.