calender_icon.png 30 October, 2024 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యోతిష్మతిలో ముగిసిన సాప్ శిక్షణ

21-07-2024 03:12:24 AM

  • క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డాటా అనలిటిక్స్‌పైన మూడు రోజుల శిక్షణ 

కరీంనగర్, జూలై 2౦ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పరిధిలోని జ్యోతిష్మతి ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(అటానమస్) కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్, డాటా అనలిటిక్స్‌పై మూడు రోజుల పాటు నిర్వహించిన  శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది.  ఎడ్యునెట్ ఫౌండేషన్ అసొసియేట్ శిక్షకుడు లక్ష్మణ్‌రావు విద్యార్థులకు ఐబీఎం, కోడ్ ఉన్నతి, ఎడ్యునెట్ ఫౌండేష్, సాప్, టాస్క్ ద్వారా సాంకేతికతపై నైపుణ్య శిక్షణ ఇచ్చారు.  ఈ శిక్షణ కార్యక్రమం సాప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్‌లో భాగంగా జ్యోతిష్మతి కళాశాలలో ఏర్పాటుచేసిన సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ల్యాబ్ సహాయంతో నిర్వహిస్తున్నారు. 

ఐబీఎం కోర్సు బయట నేర్చుకోవాలంటే గంటకి 80 డాలర్లు ఖర్చు అవుతుందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కళాశాలలోనే శిక్షణ ఇస్తున్నట్టు కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు  తెలిపారు.  శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇచ్చామని, వీటి ద్వారా భవిష్యత్తులో కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు సులువుగా పొందవచ్చునని సాగర్‌రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్  కేఎస్ రావు, అకాడమిక్స్ డీన్ డాక్టర్ పీకే వైశాలి, సీఎస్సీ విభాగాధిపతి డాక్టర్ జగదీశన్, కోఆర్డినేటర్ సింధుషా, అధ్యాపకులు,  ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.