calender_icon.png 23 April, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే స్టేషన్ ఆధునికరణ పనులను వేగంగా పూర్తి చేయండి

23-04-2025 12:23:14 AM

ఖమ్మం, ఏప్రిల్ 22 ( విజయక్రాంతి ):-జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రా మసహాయం రఘురాం రెడ్డి మంగళవారం పరిశీలించారు. స్టేషన్ లోపల కొత్తగా చేపట్టిన ఎస్కులేటర్ల నిర్మాణ పనుల పు రోగతిని.. ఎస్‌ఎస్‌ఈ అఖిల్, సీసీఐ ఎండీ. జావిద్, ఇతర రైల్వే అధికారులు మోహన్ కుమార్, అనిల్ కుమార్ తదితరులను అడి గి తెలుసుకున్నారు. 

ఎండాకాలం కదా.. జా ప్యం చేయకండి  గతంలో తాను తనిఖీ చేశానని, మార్చి కల్లా పూర్తి చేస్తామని అ ప్పుడు మాటిచ్చారని.. ఇంకా ఎందుకు పూర్తి కాలేదని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ప్రశ్నించారు. దూర ప్రాంతాలకు వెళ్లే.. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని, అసౌకర్యం కలగనివ్వొద్దని అన్నారు. ఎస్కులేటర్, ఇతర నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్బంగా  రైల్వే స్టేషన్ ఎదుట ఓ టీ స్టాల్ వద్దకు ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి వెళ్లి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి చాయ్ తాగారు. చాయ్ అచ్చీ హై.. మస్త్.. (టీ.. చాలా బాగుంది..) అంటూ కితాబునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు, ఐఎన్టీయూ సీ నాయకులు, మున్సిపల్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.