calender_icon.png 21 January, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ పనులను పూర్తిచేయండి

07-07-2024 02:47:59 AM

చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి

మందమర్రి (మంచిర్యాల), జూలై 6 (విజయక్రాంతి): క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులను వెంట నే పూర్తిచేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపల్, ఆర్ అండ్‌బీ, మిషన్ భగీరథ అధికారులతో ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలతోపాటు క్యాతన్‌పల్లి రైల్వే బ్రిడ్జి పనుల ప్రగతిపై మాట్లాడారు. మిషన్ భగీరథ, రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని.. సంబంధిత అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. మున్సిపాలిటీలో ఉన్న భూములన్నీ సింగరేణికి చెందినవని, శ్మశానవాటి కలకు 25 ఎకరాల భూమి కావాలని  సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌తో ఇదివరకే మాట్లాడామని చెప్పారు. సమావేశంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ జంగం కల, కమిషనర్లు మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.