11-04-2025 12:00:00 AM
పోషణ అభియాన్‌ను ప్రారంభించిన కలెక్టర్
ఆదిలాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరికి సంపూర్ణ పోషకాహారం అందించే దిశగా పోషణ పక్షం 2025 పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 08నుంచి 22 వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పోషణ్ అభియాన్, పోషణ పక్షం 2025 లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నార్నూర్ మండలం నడ్డం గూడా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గురువారం మినీ అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషణ పక్షం లో రక్తహీనత, హ్యాండ్ వాష్ టాపిక్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తహీనతతో బాధపడకుండా సరైన పోషకాహారం తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే బాలమృతం, పౌష్టికాహారం, మధ్యహ్నం భోజనం తో పాటు కోడిగుడ్డును ఐరన్ ఫోలిక్ మాత్రలను తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, విద్యార్ధు లు తీసుకోవాలన్నారు.
ఏప్రిల్ 14న నిర్వహించే వీహెచ్‌ఎస్‌ఎన్‌డీని విజయవంతంగా నిర్వహించాలని ఆన్నారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ మిల్కా, తహసీల్దార్, ఎంపిడిఓ, అంగన్వాడి టీచర్లు, సంబంధిత అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.