మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు
మందమర్రి (విజయక్రాంతి): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు తమ దినచర్యలో యోగస్సనాలు సాధన చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో సోమవారం ఆయుష్ సంస్థ ప్రారంభించిన ఉచిత యోగా శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యోగ ద్వారా ఒత్తిడిని జయించవచ్చని, ఒత్తిడిని జయించడం ద్వారా అనారోగ్యం దరి చేరదన్నారు. యోగాసనాలు సాధన చేయడం శరీరానికి ఉత్తేజం కలుగుతుందని ఆన్నారు. ఆయుష్ సంస్థ నియమించిన యోగ టీచర్లు ఉదయం 6 నుండి 7 గం.. వరకు, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ఉచిత యోగ శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని యోగ తరగతులను పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
అంతేకాకుండా ప్రభుత్వం అందజేస్తున్న ఆయుర్వేద వైద్యశాల సేవలను కూడా వినియోగించుకొని ప్రజలందరు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయుర్వేద డాక్టర్ నీరజ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు యోగ తరగతులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్య నియమాలను పాటిస్తూ, దీర్ఘకాలం మందులు లేకుండా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పాత బస్టాండ్ వ్యాపార సంఘం అధ్యక్షులు వడ్లకొండ కనకయ్య, బర్ల సదానందం, పట్టణ ప్రముఖులు నాకోటి వెంకటేశ్వర్లు, కొంపల్లి రమేష్ కుమార్, తుంగపిండి రాజేష్, అబ్బాస్, యోగా శిక్షకులు రామ్మోహన్, శైలజ, రజితలు పాల్గొన్నారు.