22-04-2025 12:01:05 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరో గ్యం సాధ్యపడుతుందని బాపూజీనగర్ అం గన్వాడి టీచర్ విమల అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ డివిజన్ లోని బాపూజీనగర్ అంగన్వాడి కేంద్రంలో ఐసీడీఎస్ సికింద్రాబాద్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషక పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలికలు, చిన్నారులతో కలిసి సమావేశం నిర్వహించి పౌష్టి కాహారంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ విమల మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువుకు తప్పనిసరి తల్లిపాలు పట్టించాలని సూచించారు. రెండు సంవత్సరాల వరకు శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. తల్లిపౌష్టికాహారం తీసుకున్నప్పుడే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా అన్నప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ఝాన్సీ, భాగ్యరే ఖ తదితరులు పాల్గొన్నారు.