18-04-2025 01:44:07 AM
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), ఏప్రిల్ 17: గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు అన్నారు. గురువారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ రైతు వేదికలో మండల పరిధిలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో 7వ పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడి కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. సీడీపీఓ శ్రీజ,ఏసీడీపీఓ రూప,మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్, సీహెచ్‌ఓ బిచ్చునాయక్, సూపర్వైజర్ అనిత, పోషణ కో-ఆర్డినేటర్ శివ, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు,వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.