29-03-2025 12:00:00 AM
కాలానుగుణంగా పండ్లు, కూరగా యలను తినడం మన ఆరోగ్యా నికి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. మన పూర్వీకులు ప్రాముఖ్యతనిచ్చింది స్థాని కంగా లభ్యమయ్యే తాజా, పోషక గుణాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలకే. అయితే, ఆధునిక సాంకేతికత, గ్లోబలైజేషన్ ప్రభా వంతో ఏ కాలానికైనా సంబంధం లేకుండా వివిధ దేశాల నుండి ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తున్నాయి. కాలానుగు ణంగా లభించే కూరగాయలు, పండ్లు తాజా గా, రుచిగా ఉండటమే కాకుండా పోషకప రంగా సమృద్ధిగా ఉంటాయి. అవి సహ జంగా పెరిగి, పూర్తిగా పక్వం చెందిన తర్వాతే కోయబడతాయి. కాబట్టి పోషకాలు, యాం టీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ అధికంగా ఉం టాయి. ఇవన్నీ శరీరానికి మేలు చేసే సహజ పోషకాలు.
తక్కువ కాలంలో, తక్కువ ఖర్చు తో ఉత్పత్తి కావడంతో సహజ సిద్ధమైన రుచిని ఇవి అందిస్తాయి. శరదృతు వులో ఆపిల్స్ తియ్యగా ఉండటాన్ని, శీతా కాలంలో నారింజలు జ్యూసీగా ఉండటాన్ని గమనించ వచ్చు. ప్రతి సీజనల్ పండు దాని సీజన్‌లో నే అధిక రుచిని, పోషక విలువలను అంది స్తుంది. ఉదా॥కు, వసంత కాలంలో నేరేడు, పైనాపిల్, చెర్రీలు ఎక్కువగా లభిస్తాయి. వేసవిలో పుచ్చకాయ, మామిడి వంటి జ్యూసీ పండ్లు వేడిని తట్టుకునేలా సహాయప డతాయి. స్వదేశీయంగా పెరిగిన ఆహార ప దార్థాలను తినడం ద్వారా స్థానిక రైతులను ప్రోత్సహించవచ్చు.
డా. కృష్ణకుమార్ వేపకొమ్మ