calender_icon.png 19 November, 2024 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లెట్స్‌తో సంపూర్ణ ఆరోగ్యం

19-11-2024 01:57:34 AM

డాక్టర్ ఖాదర్ వలీ 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): చిరుధాన్యా లతో మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని.. వరి, గోధుమ బదులు చిరు ధాన్యాలను ప్రధాన ఆహారంగా తీసుకోవాలని మిల్లెట్స్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఖాదర్ వలీ పేర్కొన్నారు. హిమాయత్ నగర్‌లోని ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ ఆవరణలో ‘పురాతన ధాన్యం చిరుధాన్యాల పునరాగమనం’ అనే అంశంపై సోమవారం సదస్సు నిర్వహించారు.

పాఠశాల డైరెక్టర్ ప్రార్థన మణికొండ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హాజరైన ఖాదర్ వలీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ వారంలో కనీసం ఒకరోజు చిరు ధాన్యాలను తినడానికి ‘చిరుధాన్యాల సోమవారం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలన్నారు. పాఠశాల ఆవరణలో చిరుధాన్యాల తోటను ఏర్పాటు చేయడాన్ని ఖాదర్ వలీ అభినందించారు.

కార్యక్రమంలో ఎస్ ధనుంజయ రచించిన ‘ఖాదర్‌వలీ సిరి జీవన విధానం శాస్త్రీయం, కళాత్మకం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నీటిపారుదల రంగ నిపుణులు శ్యామ్‌సుందర్ రెడ్డి, ప్రముఖ చరిత్రకారులు ఎం వేదకుమార్, కరస్పాండెంట్ కట్ట ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.