ఆదిలాబాద్: బంగ్లాదేశ్ లో హిందూ వ్యాపార సంస్థలపై, హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు మంగళవారం స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. రోడ్లపై జనాలు లేక పట్టణం నిర్మానుష్యంగా దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి అన్ని దుకాణ సముదాయాలు బంద్ చేపట్టి వ్యాపారస్తులు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు బంద్ నేపథ్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.