22-04-2025 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : యాసంగి 2024 సంవత్సరానికిగాను రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేసేం దుకు జిల్లాలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
సోమవారం జిల్లాలోని లక్షెట్టి పేట మండలం కొత్తూర్లో అంజనీపుత్ర గ్రామ సంఘం ఆధ్వర్యంలో, వెంకట్రావుపేటలో వినాయక గ్రామాఖ్య సంఘం ఆధ్వర్యంలో, ఎల్లారంలో రాజరాజేశ్వర గ్రామ సంఘం ఆధ్వర్యంలో, గుల్లకోటలో లక్ష్మిప్రసన్న గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాలతో పాటు హాజీపూర్ మండ లం గుడిపేటలో వెలుగురేఖ గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం జిల్లాలో కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరిధాన్యం కొనుగో లు కోసం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో 3 లక్షల 31 వేల 935 మెట్రిక్ టన్నుల వరిధా న్యం దిగుబడి అంచనా వేయడం జరిగింద ని, ధాన్యం కొను గోలు కొరకు జిల్లాలో 321 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొను గోలు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ ఏర్పాట్లు చేయడంతో పాటు ఓ.ఆర్.ఎస్. అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం నిల్వకు అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లను అవసరం మేరకు సమకూర్చడం జరుగు తుందని తెలిపారు.
కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధిత రైతుకు రశీదు జారీ చేయాలని తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చే సమయంలో పాటించవలసిన నిబం ధనలను రైతులకు వివరించాలని, కొను గో లు చేసిన ధాన్యాన్ని జిల్లాలో ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకు కేటాయించిన మేరకు త్వరగా తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.