25-03-2025 12:37:57 AM
రంగారెడ్డి,మార్చి 24 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కి 56 ఫిర్యాదులు అందినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను సి.నారాయణ రెడ్డికి విన్నవించారు.
ఫిర్యాదుల్లో రెవెన్యూ శాఖ 25, ఇతర శాఖలకు 31, మొత్తం 72 దరఖస్తులు అందాయి. పరీక్షలపై కలెక్టర్ ఆరా...అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా అధికారులతో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ముగిసిన అనంతరం హాస్టల్స్, సంక్షేమ వసతి గృహాలలో ఉండే పిల్లలను జాగ్రత్తగా వారి ఇండ్లకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ మరియు జిల్లా ఇంటర్మీడియట్ అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలని పిడి హౌసింగ్ కు తెలిపారు. గ్రామాలలో, మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి కొరత ఏర్పడకుండా చూడాలని డీపీఓకు, మున్సిపల్ కమిషనర్లకు, మిషన్ భగీరథ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.