calender_icon.png 4 February, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి 62 ఫిర్యాదులు

04-02-2025 12:17:52 AM

రంగారెడ్డి, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి) ప్రజావాణి కి 62 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పేర్కొ న్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి,నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్క రించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ 44, ఇతర శాఖలు  18,  మొత్తం 62  దరఖస్తులు అందాయి.

కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరిం టెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.

మేడ్చల్.. 

మేడ్చల్, ఫిబ్రవరి 3(విజయ క్రాంతి): కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 61 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపారు. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు సూచించారు.

చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్ లైన్ పోర్టల్‌లో అప్ లోడ్ చేయాలని సూచిం చారు. ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ లో పెట్టవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ హరిప్రియ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.