రంగారెడ్డి, ఆక్టోబర్ 21(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 84 ఫిర్యాదులు అందాయి. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్.. వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖకు సంబంధించి 17, జిల్లా విద్యాశాఖ 6, రెవెన్యూ శాఖ 52, పంచాయతీ శాఖ 4, మున్సిపల్ శాఖ 4, జీహెచ్‌ఎంసీ 1.. మొత్తం 84 దరఖాస్తులు అందినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.