calender_icon.png 22 February, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి

18-02-2025 12:47:29 AM

వనపర్తి టౌన్, ఫిబ్రవరి 17 : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో యాదయ్య తో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 53 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. 

ప్రత్యేక అధికారులు వసతి గృహాలను పర్యవేక్షించాలి

మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులను పర్యవేక్షించాల ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అక్కడ విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన  అవసరాలు ఏమేమి ఉన్నాయి అనే విషయాలపై నివేదిక సమ ర్పించాలని ఆదేశించారు.

అదేవిధంగా ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో ఉపాధి హామీ సి బ్బందికి పని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

ప్రజావాణికి 28 ఫిర్యాదులు 

గద్వాల , ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. యం.సంతోష్ అధికారులకు సూచిం చారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (28) ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తూ అర్జీలను జిల్లా కలెక్టర్ కు సమర్పించా రు. వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగ రావు,ఆర్డీఓ శ్రీనివాస రావు, అధికారులు, పాల్గొన్నారు.

పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, ఫిబ్రవరి 17(విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్ లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 18 ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.  కాగా,  అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెంషాలం,ఆర్. డి. ఓ. రాంచందర్,  వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.