calender_icon.png 26 March, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్వరమే ఫిర్యాదులను పరిష్కరించాలి

25-03-2025 01:55:30 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ 

నారాయణపేట, మార్చి 24(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 25 ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ను విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు అదనపు కలెక్టర్ రెవిన్యూ బెంషాలం,ఆర్. డి. ఓ. రాంచందర్,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.