calender_icon.png 28 December, 2024 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

28-12-2024 01:43:02 AM

* జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27(విజయక్రాంతి): తాగునీటి సరఫరాలో ఇబ్బందులు, కలుషిత నీటి సరఫరాపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జల  ఈడీ మయాంక్ మిట్టల్‌తో కలిసి ఓఅండ్‌ఎం అధికారులతో ఎంసీసీ (మెట్రో కస్టమర్ కేర్) ఫిర్యాదులపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంసీసీ ఫిర్యాదుల పరిష్కారం వివరాలపై ఆరా తీశారు.

సీవరేజీ ఓవర్‌ఫ్లో కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మ్యాన్‌హోళ్లు పొంగిన వెంటనే వ్యర్థాలను తొలగించాలని చెప్పారు. అలాగే జలమండలి సరఫరా చేస్తున్న నీటి ట్యాంకర్ల బుకింగ్, సరఫరాపై ఈడీ మయాంక్ మిట్టల్ సమీక్షించారు. రెసిడెన్షియల్ అవసరాలకు ట్యాంకర్లు బుక్ చేసుకునే వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.

ప్రస్తుత ట్యాంకర్ల బుకింగ్, సరఫరా, వెయిటింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ట్యాంకర్లు బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయాలని సూచించారు.