calender_icon.png 15 March, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదులను పరిష్కరించాలి

17-12-2024 12:17:23 AM

కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు 

నిజామాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ప్రజావాణి కార్య క్రమంలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 94 ఫిర్యాదులు అం దాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులను ప్రజావాణిలో ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, ఆర్డీవో సాయాగౌడ్, ఇన్‌చార్జి డీపీవో శ్రీనివాసులు అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిప్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.