calender_icon.png 10 March, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్లో నమోదు అయ్యే ఫిర్యాదులను పరిష్కరించాలి

10-03-2025 07:21:08 PM

కామారెడ్డి  పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఏస్పి..

కామారెడ్డి (విజయక్రాంతి): పోలీస్ స్టేషన్లలో నమోదు అయ్యే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర ఆదేశించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ను సోమవారం సందర్శించారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది వివరాలు, వారి పనితీరును తెలుసుకున్నారు. నేరాలు జరుగుతున్న తీరు, ఫిర్యాదుదారులతో ప్రవర్తించే విధానాన్ని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను, కమాండ్ కంట్రోల్ రూమ్, సమస్యాత్మక ముఖ్యమైన ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.