calender_icon.png 20 November, 2024 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘డీ-సిల్టింగ్’తో తగ్గిన ఫిర్యాదులు

20-11-2024 03:06:37 AM

జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19(విజయక్రాంతి):  సీవరేజ్ ఓవర్‌ఫ్లో ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను మార్చడమే లక్ష్యంగా జలమండలి చేపట్టిన స్పెషల్‌డ్రైవ్ సత్ఫలితాలను ఇస్తోందని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటిదాకా 8 వేల ప్రాంతాల్లో వేయి కిలో మీటర్ల మేర సీవరేజ్ పైపులైన్‌కు డీ-సిల్టింగ్ పనులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. స్పెషల్ డ్రైవ్ పై ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ.. గత 46 రోజులుగా జరుగుతున్న ఈ డ్రైవ్ లో 80 వేల మ్యాన్‌హోళ్లను శుభ్రం చేశామని చెప్పారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది పనితీరు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.  ఇప్పటివరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో మంచి ప్రతిభ కనబర్చిన టాప్-10 సెక్షన్ల అధికారుల్ని సత్కరించారు.  ఇంకుడు గుంతల నిర్మాణంపై సర్వే కొనసాగించాలని అధికారులకు సూచించారు. గత రెండు నెలల్లో ఎంసీసీకి వచ్చిన ఫిర్యాదుల్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ ఈ సమీక్షలో వివరించారు.

స్పెషల్ డ్రైవ్‌లో చేపట్టిన పనుల వల్ల రోజూ వచ్చే సీవరేజ్ ఫిర్యాదుల సంఖ్య తగ్గినట్లు ఆయన చెప్పారు. ఈ సమీక్షలో ఈఎన్సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ ఆపరేషన్స్- స్వామి, పర్సనల్ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.