calender_icon.png 21 January, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

20-01-2025 11:47:41 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్...

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ధరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్‌ సంగ్వాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని ప్రజలు పలు సమస్యలపై ప్రజావాణిలో ఆర్జీలను సమర్పించడం జరిగిందని, అట్టి ధరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ సమస్యలు, రైతు భరోసా, గ్రామ సమస్యలు, ఇతర ఆర్జీలు(118) సమర్పించారు. ఈ ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పరిశీలించి, ఆయా ధరఖాస్తుదారునికి సమాచారం అందించాలని సూచించారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు వి. విక్టర్, డి. శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రంగనాథ్‌రావు, జడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.