calender_icon.png 2 January, 2025 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవాలి

30-12-2024 05:20:26 PM

జిల్లా అధికారులతో కలెక్టర్ ఆశిష్ సంగువన్...

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగువన్ మాట్లాడుతూ.. జిల్లాలోనీ ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానికి అర్జీలను కలెక్టర్ కు సమర్పించడం జరుగుతుందన్నారు. అట్టి ప్రజావాణి ద్వారా సంబంధిత అధికారులు ప్రజల దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు.

ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో (78) దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి పరిష్కరించడానికి ఆయా అధికారులకు పంపించడం జరుగుతున్నదని తెలిపారు. భూ సమస్యలు, సదరం సర్టిఫికెట్స్, వ్యక్తిగత సమస్యలు వంటి అర్జీలు రావడం జరిగాయని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.