18-03-2025 01:02:24 AM
కరీంనగర్,మార్చి17(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ దరఖాస్తులను పెండింలో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్లతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 253 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి కిరణ్, ప్రఫుల్ దేశాయి, మున్సిపల్ కమిషనర్ చాహత్ భాజ్ పాయి, ఆర్డీఓలు రమేష్, మహేశ్వర్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, పాల్గొన్నారు.