calender_icon.png 20 January, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవతి మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదులు

07-12-2024 02:22:50 AM

ముషీరాబాద్/హైదరాబాద్, డిసెంబర్ 6 : (విజయక్రాం తి): పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు న్యాయవాది రవికుమార్ శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సంధ్యా థియేటర్ యాజమాన్యం భద్రతా ఏర్పాట్లు పాటించకపోవడంతో పాటు రద్దీని నియంత్రించలేకపోయిందని అందులో పేర్కొన్నారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమరుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో దవాఖానలో చికి త్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ. 5 కోట్లు పరిహారం ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలిసింది.

హీరో అల్లు అర్జున్‌తో పాటు సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకోవాలని న్యాయవాది రవికుమార్ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. కాగా బెనిఫిట్ షో పేరిట అమాయకులైన ప్రజల ప్రాణాలు తీస్తున్నారని సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ విమర్శించారు. మృతురా లు రేవతి కుటుంబానికి రూ.10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారణమైన అల్లు అర్జు న్‌ను అరెస్ట్ చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులకు  జడ్సన్ ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండానే ఆయన థియేటర్‌కు రావడంతోనే తొక్కిసలాట జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.