calender_icon.png 22 October, 2024 | 8:57 PM

ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరా?

22-10-2024 12:52:28 AM

  1. సస్పెండ్ చేయకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం 
  2. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ 

వనపర్తి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరిడెంట్ ప్రభువినయ్‌కుమార్ అవినీతి అక్రమాలపై ఆధా రాలతో సహా ఫిర్యాదు చేసినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాపాడుతు న్నారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచా ల యుగంధర్ గౌడ్ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ వద్ద ఆయన మాట్లాడారు.

నాలుగు నెలల నుంచి సదరు అధికారి విధులకు హాజరు కాకుండా హాజరు రిజిస్టర్, ఫైల్స్‌ను ఇంటి వద్దకే తెప్పించుకుని సంతకాలు చేస్తూ జీతం తీసుకుంటున్నాడని జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యా దు చేసి 17 రోజులైనా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోకుంటే బుధవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తామనిహెచ్చరించారు.