మంథని(విజయక్రాంతి): మంథని వచ్చిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షకు మంథని మున్సిపల్ పరిధిలో అనధికారికంగా నిర్వహస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు పిర్యాదు చేశారు. మంథనిలో దాదాపు ఎనిమిది కి పైగా వాటర్ ప్లాంట్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, అదే విధంగా కనీస నియమ నిబంధనలు పాటించకుండా అపరిశుభ్రంగా ఉన్న నీటిని, కెమికల్ తో కూడిన నీటిని సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తున్నారు. వర్ష కాలం కావడంతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. జిల్లాలో ఎక్కడ లేని విధంగా అధిక ధరలకు నీటిని విక్రయిస్తున్నారు.ఇట్టి అనధికారిక వాటర్ ప్లాంట్ల పై తగు చర్యలు తీసుకోవాలని పిర్యాదు లో పేర్కొన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్, నాయకులు గొర్రెంకాల సురేష్, బావు రవిలు ఉన్నారు.