calender_icon.png 19 November, 2024 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ఆర్ వైన్స్ పై ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు

19-11-2024 11:45:29 AM

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి క్రాంతికుమార్..

మంథని (విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీలో గల ఆర్ఆర్ వైన్స్ లో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యాలపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం తీరుపై బిజెపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి పోతార వేణి క్రాంతికుమార్ ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మంథని ఎక్సైజ్ శాఖ సిఐ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, దానికి, మళ్లీ పెద్దపెల్లి జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ మహిపాల్ రెడ్డిని కలిసి ఇట్టి విషయంపై సమగ్ర విచారణ చేపట్టి షాప్ యాజమాన్యంపై తగిన రీతిలో చట్టపరమైన చర్యలు తీసుకొని ఆర్ఆర్ వైన్స్ ను సీజ్ చేయవలసిందిగా ఫిర్యాదు చేశామని, ఈ విషయంపై వారు సానుకూలంగా స్పందించి త్వరగా విచారణ చేపట్టి దోషులుగా తేలితే వారిపై చట్టపరంగా తగు విధమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారని, ఈ విషయంపై త్వరలో హైదరాబాద్ లోని బాలల సంక్షేమ కార్యాలయంలో ఫిర్యాదు చేయనున్నట్లు పోతరవేన క్రాంతి  తెలిపారు.