calender_icon.png 27 January, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేకు ఫిర్యాదు

26-01-2025 01:00:10 AM

మహబూబ్‌నగర్, జనవరి 25 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ సైకాలజిస్ట్, బేస్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్న లక్ష్మణ్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికీ చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు క్యాంపు కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు.

సివిల్స్ లో శిక్షణ ఇస్తానని చెప్పి 40 మంది విద్యార్థులను పాఠశాలలకు వెళ్లకుండా కోచింగ్ సెంటర్లో నిర్బంధించి శిక్షణ ఇస్తు న్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ను కోరారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన వారిలో రాజేశ్వరి, కస్తూరి, చంద్రకళ, మహేశ్వరి ఉన్నారు.