calender_icon.png 17 April, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మశానవాటిక కబ్జాపై హైడ్రాకు ఫిర్యాదు

08-04-2025 11:42:50 PM

పరిశీలించిన కమిషనర్ ఏ.వి.రంగనాథ్...

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని మోతుకుల కుంట చెరువు దగ్గరలోని హిందూ స్మశానవాటికను రామ్‌కీ సంస్థ కబ్జాచేసి.. అందులో చెత్త డంపింగ్ చేయడంతో పరిసరాలు దుర్గంధబరితంగా మారాయని మచ్చబొల్లారం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీ హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగానాథ్ మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. సర్వే నంబరు 199లో మొత్తం 15.19 ఎకరాల స్థలాన్ని హిందూ స్మశానవాటికకు కేటాయించగా.. ఆ స్థలంలో రామ్‌కీ సంస్థ చెత్త డంపింగ్ చేయడాన్ని, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఇ

దే విషయంపై స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ సమస్యను పరిశీలించి, పరిష్కార మార్గాలు చూపాలని తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని మంత్రి శ్రీధర్ బాబు సూచించినట్లు తెలిపారు. తక్షణమే నిర్మాణాలను ఆపేయాలని రామ్‌కీ సంస్థను ఆదేశించామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ భూమి  కబ్జా కాకుండా చూస్తామని,  నావాసాల మధ్య చెత్త డంపింగ్ యార్డును నిర్వహిస్తుండడంతో ఇబ్బందికర పరిసితులను గమనించామన్నారు. చెత్త డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు చేస్తున్న ప్రతిపాదనను ప్రభుత్వ దృష్టికి  తీసుకెళ్తామని పేర్కొన్నారు.