calender_icon.png 4 March, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలవిహార్‌పై హైడ్రాకు ఫిర్యాదు

19-09-2024 12:28:42 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 18 (విజయక్రాంతి): హుస్సేన్ సాగర్‌ను ఆక్రమించుకుని జలవిహార్ అక్రమ కట్టడాలు, పర్యావరణ ఉల్లంఘనలను పరిశీలించి హైడ్రా తక్షణం చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేశ్ వినతిపత్రం అందజేశారు.