calender_icon.png 31 January, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

30-01-2025 09:54:29 PM

లోయర్ ట్యాంక్‌బండ్‌లోని హుస్సేన్‌సాగర్ కట్టను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నషెడ్డు

ముషీరాబాద్,(విజయక్రాంతి): లోయర్ ట్యాంక్‌బండ్‌లో హుస్సేన్‌సాగర్ కట్టలో అక్రమంగా కొనసాగుతున్న షెడ్డును తొలగించాలని స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆక్రమణలు తొలగించాలని స్థానికులు లోక్‌నాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం లోయర్ ట్యాంక్‌బండ్‌లో విలేకరులతో మాట్లాడుతూ జనవరి 22న ఈ ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఇష్టారాజ్యంగా రోడ్డు, హుస్సేన్‌సాగర్ కట్టను ఆక్రమించి ఆక్రమంగా వ్యాపారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన రోడ్డుపై కార్లు, ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసి మరమ్మత్తులు చేయడంతో లోయర్ ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మ దేవాలయం నుంచి ముషీరాబాద్ తహశీల్ధార్ కార్యాలయానికి వచ్చేదారిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.